Tata Group IPO: టాటా గ్రూప్ నుంచి మరో ఐపీఓ .. 10 d ago
టాటా గ్రూప్‌కు చెందిన టాటా క్యాపిటల్ త్వరలో ఐపీఓ ప్రాథమిక ప్రజా పరిశ్రమకి సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఓ ద్వారా దాదాపు 2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.17వేల కోట్లు) సమీకరించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. టాటా టెక్నాలజీస్ విజయవంతమైన బంపర్ లిస్టింగ్ తర్వాత టాటా గ్రూప్ నుంచి మరిన్ని సంస్థలు రాబోతున్నాయని మదుపర్లలో ఆసక్తి మొదలైంది.